Bigg Boss Telugu 7 : ప్రశాంత్‌కు రతిక మరో వెన్నుపోటు .. అర్జున్ మాటలకు శోభ కంటతడి, ‘‘ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ’’లో ట్విస్టులు
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 7 తెలుగులో ప్రస్తుతం 10 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. సోమ, మంగళవారాల్లో నామినేషన్స్ రచ్చ నడవగా.. టాప్ 10 ప్లేస్‌ల్లో ఎవరు వుండాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాల్సిందిగా బిగ్‌బాస్ ఆదేశించారు. అయితే టాప్ ప్లేస్‌లో నిలబడేందుకు కంటెస్టెంట్స్ మధ్య పెద్ద యుద్ధం జరిగింది. చివరికి శివాజీని టాప్ 1లో నిలబెట్టి.. యావర్ సెకండ్ ప్లేస్‌లో, పల్లవి ప్రశాంత్ మూడు, ప్రియాంక నాలుగు, శోభాశెట్టిలో ఐదులో నిలబడ్డారు. అమర్‌దీప్ 6, గౌతమ్ 7, అర్జున్ 8, అశ్విని 9, రతిక 10లో నిలబడ్డారు. బిగ్‌బాస్ గత సీజన్‌లలో టాప్ 5లో నిలబడిన వారికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకునే అవకాశం వుంటుంది. ఇందుకోసం కంటెస్టెంట్స్ అంతా రెడీ అవుతుండగా బిగ్‌బాస్ షాకిచ్చాడు. 6 నుంచి 10 స్థానాల్లో నిలబడిన వారు ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీ పడేందుకు సిద్ధమవ్వాలని సూచించాడు.
అయితే ప్లేస్ విషయంలో అర్జున్ అన్న మాటలకు శోభాశెట్టి హర్ట్ అయ్యింది. టాప్ 10లో శోభ 7వ స్థానానికి కరెక్ట్‌గా సెట్ అవుతుందని , ఆమెకు హౌస్‌లో ప్రతీసారి అదృష్టం కలిసి వస్తోంది తప్పించి శోభ గట్టిగా ఆడిన సందర్భాలు లేవని కామెట్ చేశాడు. అక్కడ కొంచెం కవర్ చేసుకున్న శోభ బాత్‌రూంలోకి వెళ్లి ఏడ్చింది. రతిక మరోసారి వెన్నుపోటు రాజకీయాలు మొదలుపెట్టింది. పల్లవి ప్రశాంత్ నెంబర్ వన్ ప్లేస్‌కి కరెక్ట్ అని శివాజీ చెప్పడంతో అతను ఎమోషనల్ అయ్యాడు. నా కోసం శివాజీ అన్న ఎంతో చేశారని.. ఈ సీజన్‌కు ఫస్ట్ కెప్టెన్ పల్లవి ప్రశాంత్ అని.. అతను ఓ రైతు బిడ్డ అని గర్వంగా చెప్పాడు. ఇంతలో రతిక మధ్యలో దూరి మొదటి నాలుగు వారాల్లో నీ గేమ్ ఏం లేదు.. ఎవరో ఒకరు సాయం చేస్తూనే వున్నారు. నువ్వు గేమ్ ఓన్‌గా ఆడుతున్నావో, ఓ గ్రూప్‌గా ఆడుతున్నావో కనిపించడం లేదంటూ కామెంట్ చేసింది.
రతిక మాటలకు పల్లవి ప్రశాంత్ సీరియస్ అయ్యాడు. అక్కా.. మా అమ్మను, మా నాన్నని తిట్టావు.. గడ్డం గీకేస్తానంటూ ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశాడు. అయినప్పటికీ నేను ఇంటికి ఫస్ట్ కెప్టెన్ అయ్యా, నా కోసం శివాజీ అన్న లెటర్ త్యాగం చేశాడంటూ రతికకు కౌంటర్ ఇచ్చాడు. వీరి గొడవ ముగిశాక.. ప్రిన్స్ యావర్-అశ్వినీల మధ్య వాగ్వాదం జరిగింది. యావర్ ప్లేస్‌ను అశ్విని కన్ఫర్మ్ చేస్తుండగా ఇద్దరు గొడవ పడ్డారు. ఇదేనా ఒక అమ్మాయికి ఇచ్చే మర్యాద అంటూ యావర్‌పై ఫైర్ అయ్యింది. దీనికి అతను కూడా అంతే ఘాటుగా బదులిచ్చాడు. నువ్వు అలా చెప్పొద్దు.. నాకు అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలుసు.. నువ్వేం నేర్పించనక్కర్లేదు అంటూ వార్నింగ్ ఇచ్చాడు.
బిగ్‌బాస్ గత సీజన్‌లలో టాప్ 5లో నిలబడిన వారికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకునే అవకాశం వుంటుంది. ఇందుకోసం కంటెస్టెంట్స్ అంతా రెడీ అవుతుండగా బిగ్‌బాస్ షాకిచ్చాడు. 6 నుంచి 10 స్థానాల్లో నిలబడిన వారు ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీ పడేందుకు సిద్ధమవ్వాలని సూచించాడు. అనంతరం వీరికి పజిల్ గేమ్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో అర్జున్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ సంపాదించాడు. అంతా ఆనందంగా వుండగా బిగ్‌బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. 1 నుంచి 5 స్థానాల్లో నిలబడిన శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, శోభాశెట్టి, ప్రియాంకలలో ఒకరిని ఎంపిక చేసుకుని ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీ పడాలని ఆదేశించాడు.
బిగ్‌బాస్ ఆదేశాల మేరకు ప్రిన్స్ యావర్‌ను తనకు పోటీదారుడిగా ఎంపిక చేసుకున్నాడు. అయితే ఈ పోటీలో ఎవరు పోటీపడినా మరోసారి ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీపడే అవకాశం వుండదని మరో షాకిచ్చాడు బిగ్‌బాస్. అయినప్పటికీ ఇద్దరూ పోటీకి సై అన్నారు. టాస్క్ ప్రకారం.. అర్జున్, యావర్ ఒక బోర్డుపై నిలబడాలి. ఆ బోర్డ్ కదులుతూ వుంటుంది. అయినా దానిని బ్యాలెన్స్ చేసుకుంటూ, దాని మీద వున్న ఐదు పోల్స్‌పై ఐదు బాల్స్‌ను నిలబెట్టాలి. ఈ క్రమంలో బాల్ కిందపడితే, బోర్డుపై నుంచి దిగి కంటెస్టెంట్సే బాల్‌ను తిరిగి తెచ్చుకోవాలి. ఈ టాస్క్‌లో యావర్ గెలిచాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com